సిలిండర్ బాయ్‌కు ఒక్క పైకా ఇవ్వక్కర్లేదు : హెచ్.పి.సి.ఎల్

బుధవారం, 18 జనవరి 2023 (09:57 IST)
గ్యాస్ సిలిండర్‍ను ఇంటికి తీసుకొచ్చే సిలిండర్ బాయ్‍కు ఒక్క పైసా ఇవ్వక్కర్లేదని ప్రభుత్వం రంగ చమురు కంపెనీ అయిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్.పి.సి.ఎల్) స్పష్టంచేసింది. ఈ మేరకు హెచ్.పి.సి.ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ సీకే నరసింహా స్పష్టంచేశారు. గ్యాసి సిలిండర్ తీసుకొస్తున్న ప్రతిసారీ రూ.30 లేదా రూ.50 అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు. 
 
డిస్ట్రిబ్యూటర్లే వినియోగదారుల ఇంటి వద్దకు గ్యాస్ సిలిండర్ చేర్చాల్సి ఉంటుందని, అందుకయ్యే ఖర్చను వారు చెల్లించే బిల్లులోనే కలిపి ఉంటాయన తెలిపారు. అందువల్ల డెలివరీ బాయ్‌లకు అదనంగా డబ్బు చెల్లించాల్సి అవసరం లేదని ఆయన వివరించారు. హైదరాబాద్ నగరానికి చెందిన రాబిన్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రశ్నించగా ఈ మేరకు సమాధానమిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు