రూ.80 వేల కోట్లతో 500 విమానాలు .. ఎయిరిండియా ప్లాన్

సోమవారం, 12 డిశెంబరు 2022 (09:50 IST)
విమాన సర్వీసు దిగ్గజం ఎయిరిండియా దశ తిరగనుంది. ఈ సంస్థను టాటా కొనుగోలు చేసిన తర్వాత ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలుగా ఎన్నో మెరుగైన సౌకర్యాలను కల్పిస్తుంది. ఇందులోభాగంగా, తాజాగా మరో 500 కొత్త విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.80 వేల కోట్లను ఖర్చు చేయనుంది. ఈ విమానాలను బోయింగ్, ఎయిర్ బస్ సంస్థల నుంచి కొనుగోలు చేసేలా ప్రణాళికలను రూపొందిస్తుంది. 
 
కొత్తగా కొనుగోలు చేసే విమానాల్లో 400 విమానాలను తక్కువ సీట్లు కలిగినవిగాను, మరో 100 విమానాలు భారీ సైజువి కొనుగోలు చేయనుంది. ఈ భారీ విమానాల్లో ఎయిర్‌బస్‌కు చెందిన 350 విమానాలతో బోయింగ్ సంస్థకు చెందిన 787, 777 విమానాలు కొనుగోలు చేయనుంది. ఈ మహా కొనుగోలు ఒప్పందం పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనుంది. అయితే, ఈ వార్తలపై ఎయిరిండియా అధికారిక ప్రకటన చేయాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు