హైదరాబాద్ మెట్రో స్టేషన్లు ప్రస్తుతం వార్తల్లో బాగానే నిలుస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్‌లో ప్రారంభమైన అయ్యంగార్ ఇడ్లీ దోశ క్యాంటీన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ.50 చెల్లిస్తే ఇష్టం వచ్చినట్లు ఇడ్లీలు, దోసెలు, పొంగల్‌ను టిఫిన్‌గా తీసుకోవచ్చు.