ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఈ రోజు స్టార్టప్ లాంజ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది, ఇది భారతదేశంలో వ్యవస్థాపకులకు మద్దతు ఇవ్వడానికి, ప్రారంభ-దశ స్టార్టప్‌లకు సాధికారత కల్పించడానికి రూపొందించబడిన ప్రత్యేక ప్రాంగణం. బెంగుళూరులోని కోరమంగళలో ఉన్న ఈ వినూత్న ప్రాంగణం, తమ వ్యాపారాలను విస్తరింప చేయాలనుకునే వ్యవస్థాపకులకు అవసరమైన వనరులు, మార్గదర్శకత్వం, నెట్వర్కింగ్ అవకాశాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా శ్రీ భవేష్ జటానియా, హెడ్ స్టార్టప్ బ్యాంకింగ్ మాట్లాడుతూ, "భారతదేశంలో ఒక బ్యాంకు ద్వారా ప్రారంభించబడిన మొట్టమొదటి, వినూత్న కార్యక్రమం, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ స్టార్టప్ లాంజ్‌ని ప్రారంభించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఈ స్టార్టప్ లాంజ్ సమావేశ, సహకార కేంద్రంగా పనిచేస్తుంది, వ్యవస్థాపకులకు ఆవిష్కరణలు, అభివృద్ధి చెందడానికి అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. ప్రముఖ ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్లు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు, ఏంజెల్ ఇన్వెస్టర్లతో కూడా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ భాగస్వామిగా ఉంటుంది, వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార వాతావరణంలో స్టార్టప్‌లు పోటీతత్వాన్ని పొందడంలో సహాయపడే సినర్జీలను సృష్టిస్తుంది.." అని అన్నారు.
ఫస్ట్ వింగ్స్ స్టార్ట్-అప్ లాంజ్‌లో మీటింగ్ రూమ్‌లు, అధునాతన వీడియో కాన్ఫరెన్సింగ్ పరిష్కారాలతో సహా అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి, వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు అనుసంధానం కావడానికి, సహకరించడానికి, ఎదగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టించారు.,వ్యవస్థాపకులకు అదనపు సహాయాన్ని అందించడానికి ఈ లాంజ్ పలు కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.