ఆరు వేరియంట్లలో టాటా సఫారీ... ధర ఎంతంటే..?

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (16:00 IST)
Tata Safari
టాటా మోటార్స్ సంస్థ సరికొత్తగా టాటా సఫారీ కారును మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఈ కారు బేసిక్ మోడ‌ల్ ధ‌ర‌ను 14.69 ల‌క్ష‌లుగా నిర్ణయించారు. టాప్ ఎండ్ మోడ‌ల్ ఖ‌రీదు 21.45 ల‌క్షలుగా ఖరారు చేశారు. 
 
టాటా స‌ఫారీ ఎస్‌యూవీ కార్ల‌ను సోమవారం మొత్తం ఆరు వేరియంట్ల‌లో రిలీజ్ చేస్తున్నారు. XE, XM, XT, XT+, XZ, XZ+ మోడ‌ళ్ల‌లో టాటా స‌ఫారీ అందుబాటులోకి రానున్నాయి. స‌ఫారీలోనే కొత్త వేరియంట్‌ను కూడా రిలీజ్ చేస్తున్నారు. అడ్వెంచ‌ర్ ప‌ర్సోనా పేరుతో ఆ కారును విడుద‌ల చేస్తున్నారు. ఈ కారు ధరను రూ.20.20 ల‌క్ష‌లుగా నిర్ణయించారు. 
 
గ్రావిటాస్ కాన్సెప్ట్‌తోనే మ‌ళ్లీ కొత్త స‌ఫారీల‌ను లాంచ్ చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌ల టాటా సంస్థ వెల్ల‌డించింది. కొత్త స‌ఫారీ కోసం బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 30వేల టోకెన్ అమౌంట్‌తో స‌ఫారీని బుక్ చేసుకోవ‌చ్చు. సిక్స్ సీట‌ర్‌, సెవ‌ర్ సీట‌ర్‌గా.. రెండు ర‌కాల కార్ల‌ను రిలీజ్ చేస్తున్నారు. 
 
తాజా లాండ్ చేస్తున్న ఆరు వేరియంట్ల‌లో అన్ని మోడ‌ల్స్‌లో సెవ‌న్ సీట‌ర్లు ఉన్నాయి. అయితే, ఈ రేంజ్‌లో ఇప్ప‌టికే మార్కెట్‌లో ఉన్న ఎంజీ హెక్టార్ స్‌, మ‌హీంద్రా ఎక్స్‌యూవీ 500, జీప్ కంపాస్‌ల‌తో స‌ఫారీ పోటీ ప‌డ‌నుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు