దేశంలో మరో ఐపీఎల్ క్రికెట్ సందడి ప్రారంభంకానుంది. మార్చి నెలాఖరు లేదు ఏప్రిల్ నెల మొదటివారంలో ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ సీజన్‌కు ముందే అన్ని ఫ్రాంఛైజీలు తాము అట్టిపెట్టుకున్న, వదులుకున్న ఆటగాళ్ల జాబితాలను జనవరిలో విడుదల చేశాయి.
ఈ వేలంలో పాల్గొనడానికి మొత్తం 1,144 మంది ఆటగాళ్లు దరఖాస్తు చేసుకోగా, అందులో 292 మందిని ఎంపిక చేశారు. వారిలోనూ 164 మంది భారత ఆటగాళ్లకు, 125 విదేశీ ఆటగాళ్లకు, మరో ముగ్గురు అసోసియేట్ దేశాల ఆటగాళ్లకు అవకాశం కల్పించారు.
ఇక ఈ 292 మంది క్రికెటర్లలో 61 మందినే వేలంలో ఫ్రాంఛైజీలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అత్యధికంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మందిని తీసుకొనే అవకాశం ఉంది. తర్వాత అత్యధిక ఖాళీలున్న జట్లు పంజాబ్, రాజస్థాన్. ఈ రెండు జట్లు ఇంకా 9 మంది చొప్పున కొనుగోలు చేసే అవకాశం ఉంది.