కలిసొచ్చిన లాక్ డౌన్.. మరింత సంపన్నులుగా మారిన కోటీశ్వరులు

సోమవారం, 25 జనవరి 2021 (13:29 IST)
కరోనా వైరస్ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయంలో భారత్‌లో బిలియనీర్లు 35 శాతం మరింత సంపన్నులయ్యారు. మరోవైపు లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ ఎన్జీవో ఆక్స్‌ఫామ్ పేర్కొన్నది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎనకామిక్ ఫోరమ్ సదస్సులో ఆక్స్‌ఫామ్ తన రిపోర్ట్‌ను ప్రవేశపెట్టనున్నది. ద ఇనిక్వాలిటీ వైరస్ టైటిల్‌తో నివేదికను రూపొందించారు. 
 
భారత్‌లోని కోటీశ్వరుల సంపద లాక్‌డౌన్ సమయంలో 35 శాతం పెరిగినట్లు ఆ నివేదికలో అంచనా వేశారు. 84 శాతం కుటుంబాలు మాత్రం ఆదాయాన్ని కోల్పోయినట్లు పేర్కొన్నారు. గత ఏడాది ఏప్రిల్లో ప్రతి గంటకు సుమారు 1.7 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలో తెలిపారు. 
 
భారత్‌లోని టాప్ 100 మంది బిలియనీర్ల ఆదాయం బాగా పెరిగినట్లు ఆక్స్‌ఫామ్ చెప్పింది. బిలియనీర్ల ఆదాయం ఎంత పెరిగిందంటే వాళ్లు 138 మిలియన్ల పేదలకు ఒక్కొక్కరికి రూ.94 వేల చెక్ ఇవ్వవచ్చు అని ఆ సంస్థ పేర్కొంది.
 
దేశంలో అసమానతలు తారా స్థాయిలో ఉన్నాయని, మహమ్మారి సమయంలో రిలయన్స్ అధినేత ముకేశ్ ఒక గంటలో సంపాదించిన మొత్తాన్ని.. ఓ అసంఘటిత కార్మికుడు ఆ మొత్తాన్ని సంపాదించాలంటే కనీసం 10 వేల ఏళ్లు పడుతుందని రిపోర్ట్‌లో అభిప్రాయపడ్డారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు