రూ.999కే విమాన ప్రయాణం.. ఫెస్టివల్ సేల్... బుకింగ్స్ ప్రారంభం

సోమవారం, 3 సెప్టెంబరు 2018 (16:31 IST)
దేశంలో చౌక ధరలకే విమాన సేవలను అందుబాటులోకి తెచ్చిన ప్రైవేట్ విమానయాన సంస్థ ఇండిగో. ఈ సంస్థ ఇపుడు మరోమారు అతి తక్కువ ధరకే విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఫెస్టివల్ సేల్ పేరుతో ఈ టిక్కెట్ల విక్రయానికి శ్రీకారం చుట్టింది. స్వదేశీ సర్వీసుల్లో టిక్కెట్ ప్రారంభ ధర రూ.999గాను, అంతర్జాతీయ సర్వీసులకు రూ.3199గా నిర్ణయించింది.
 
ఇందులోభాగంగా, ఈ టిక్కెట్ల విక్రయం సోమవారం నుంచి ప్రారంభించి, ఈనెల 16వ తేదీ వరకు విక్రయించనుంది. ఈ ఆఫర్ కింద ఏకంగా 10 లక్షల టిక్కెట్లను విక్రయానికి ఉంచింది. ఈ ఆఫర్ కింద కొనుగోలు చేసిన టిక్కెట్లు ఈనెల 18వ తేదీ నుంచి 2019 మార్చి 30వ తేదీ వరకు ప్రయాణించవచ్చు. 
 
జూలైలో 1.2 మిలియన్ సీట్లను రూ.1212 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంచింది. దీనికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. ఇపుడు మరోమారు ఇదే తరహా ఆఫర్‌ కింద టిక్కెట్లను విక్రయించనుంది. 
 
కాగా, మొబిక్విక్ మొబైల్ వాలెట్ నుంచి టికెట్లను కొనుగోలు చేసే వినియోగదారులకు 20 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఇండిగో దేశ వ్యాప్తంగా రోజుకు 52 గమ్యస్థానాల్లో 1,100 విమాన సర్వీసులును నడుపుతున్న విషయం తెల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు