కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం కేంద్రం లాక్డౌన్ అమలు చేస్తోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణా బంద్ అయింది. ముఖ్యంగా, అంతర్జాతీయ విమాన సర్వీసులు కూడా ఆపేశారు. ఈ క్రమంలో 70 రోజుల తర్వాత లాక్డౌన్ ఆంక్షలను క్రమంగా సడలిస్తూ వస్తున్నారు.
కాగా, కరోనా లాక్‌డౌన్‌తో విమానయాన రంగం కుదేలైపోయింది. విదేశాల నుంచి భారతీయులను తీసుకురావడానికి మాత్రం కేంద్ర ప్రభుత్వం తొలుత ఎయిర్ ఇండియా, ఆ తర్వాత ప్రైవేటు విమానయాన సంస్థలకు అనుమతులు ఇచ్చింది.
అలాగే, దేశంలో కూడా రైలు రాకపోకలను కూడా క్రమంగా పునరుద్ధరిస్తోంది. ఇందులోభాగంగా, ఇప్పటికే శ్రామిక్ రైళ్లను నడిపిన రైల్వేశాఖ ఆ తర్వాత 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. వీటి తర్వాత మరో 250 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు తయారు చేస్తోంది.