కొత్త సంవత్సరంలో రైలు ప్రయాణికులు రైల్వే శాఖ ఓ శుభవార్త చెప్పనుంది. రైల్వే టికెట్ బుక్ చేసుకోడానికి సులువైన యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి వెల్లడించారు. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునేవారి సంఖ్య క్రమంగా పెరుగుతుండటం, స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా బాగా పెరగడంతో ఈ కొత్త యాప్‌ను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వివరించారు.