అలీబాబా ఫౌండర్ జాక్ మాకు చుక్కలు.. భారీ జరిమానాకు సిద్ధం

శుక్రవారం, 12 మార్చి 2021 (13:17 IST)
చైనా నియంత్రణ సంస్థలపై గతేడాది అక్టోబర్‌లో అలీబాబా ఫౌండర్ జాక్ మా చేసిన వ్యాఖ్యలతో ఆయన కష్టాలు మొదలయ్యాయి. రెండు నెలల పాటు జాక్ మా కూడా కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే.
 
అయినా చైనా తమ దేశ బిలియనీర్ జాక్ మాను వేధింపులకు గురిచేస్తూనే వుంది. ఆయన సంస్థ అలీబాబా గుత్తాధిపత్యానికి సంబంధించిన నిబంధనలను అతిక్రమించిందన్న కారణంతో ఏకంగా 100 కోట్ల డాలర్లు (సుమారు రూ.7300 కోట్లు) జరిమానా విధించడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో అమెరికా చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌పై 97.5 కోట్ల డాలర్ల జరిమానా విధించింది చైనా. 
 
ఇప్పటి వరకూ ఇదే అత్యధికంగా కాగా.. ఇప్పుడు అలీబాబాపై అంతకుమించి ఫైన్ వేయడానికి సిద్ధమవుతుంది. అయితే ఈ వార్తలపై అలీబాబా ఇప్పటి వరకూ అధికారికంగా స్పందించలేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు