భారత ప్రభుత్వ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి మద్దతు అందిస్తూ ముంబై కేంద్రంగా కలిగిన సుప్రసిద్ధ కన్స్యూమర్ లైఫ్‌స్టైల్, ప్రీమియం మొబైల్ యాక్ససరీస్ బ్రాండ్ కెడీఎం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, మేక్ ఫర్ వరల్డ్ ఆలోచనతో తమ ప్రణాళికలను రూపొందించింది. తద్వారా మొబైల్ యాక్ససరీలలో స్వీయ సమృద్ధిని ప్రోత్సహిస్తుంది.
కెడీఎం ఇప్పుడు హైదరాబాద్, ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, చెన్నైలో స్ధానిక, కాంట్రాక్ట్ తయారీదారుల మద్దతును కోరుకుంటుంది. తద్వారా అంతర్జాతీయ మార్కెట్‌లకూ విస్తరించాలనుకుంటుంది. భారతదేశం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న తయారీదారులతో కలిసి పనిచేయడం ద్వారా కెడీఎం ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటుంది.
కెడీఎం ఇప్పుడు లైఫ్‌స్టైల్ ఎంపికలను మొబైల్ యాక్ససరీలలో అందిస్తుంది. ఈ కంపెనీ 2025 నాటికి ఒక లక్ష మంది డీలర్లతో ప్రతి ఇంటిలోనూ కెడీఎం లక్ష్యంతో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. కెడీఎం ఉత్పత్తులను ముంబైలో పరిశోధించి, అభివృద్ధి చేస్తుండగా, ఢిల్లీ, నోయిడా, గుజరాత్‌తో పాటుగా ఇతర ప్రాంతాలలో తయారుచేస్తున్నారు. నాణ్యత పరంగా ఎలాంటి రాజీలేకుండా కెడీఎం తమ ఉత్పత్తులను తయారుచేస్తోంది.
కెడీఎం ఫౌండర్ ఎన్ డీ మాలి మాట్లాడుతూ, ప్రతి భారతీయుని మదిలో మేక్ ఇన్ ఇండియా మంత్రం ధ్వనిస్తూనే ఉంటుంది. భారతీయ వినియోగదారుల నడుమ వోకల్ ఫర్ లోకల్ సెంటిమెంట్ బలంగా ఉందిప్పుడు. గత కొద్ది సంవత్సరాలుగా బలమైన మొబైల్ యాక్ససరీస్ కేంద్రంగా ఇండియా అభివృద్ధి చెందుతుంది. మేక్ ఇన్ ఇండియా, పీఎల్‌ఐ, ఇతర కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం మద్దతు అందిస్తుండటంతో తయారీ రంగం మరింత వేగంగా వృద్ధి చెందగలదు అని అన్నారు.