క్వింటాల్ రూ.23,100-ఎర్రబంగారానికి డిమాండ్.. రైతన్నల హర్షం

శనివారం, 14 అక్టోబరు 2023 (12:22 IST)
కర్నూలు జిల్లాలో ఎర్రబంగారానికి డిమాండ్ పెరుగుతుంది. నంద్యాల జిల్లా మిర్చి మార్కెట్ యార్డుల్లో ఎండుమిర్చి క్వింటాల్ రూ.23,100 దాక పలుకుతుంది. మిర్చి ధరలు రైతులకు గిట్టుబాటు ధర పలుకుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
 
రైతులు పండిన మిర్చి పంటను గుంటూరుకు తీసుకువెళ్తే కొన్ని కొన్ని సమయాల్లోసరైన గిట్టుబాటు ధరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే వారు. కనీసం రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో పండిన పంటనంత అక్కడే వదిలేసి వచ్చిన పరిస్థితి లేకపోలేదు. 
 
అయితే నంద్యాల పట్టణంలో మిర్చి యార్డు ఏర్పాటు చేయడంతో రైతులంతా ప్రస్తుతం మిర్చి సాగుపై మక్కువ చూపడం విశేషం. ప్రస్తుతం ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా45వేల హెక్టార్లలో మిర్చి పంట సాగవుతుండగా ప్రతి ఏటా 2లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు