మనలో చాలామంది కోవిడ్ 19ను ఓ వినాశకారిగా భావిస్తున్నప్పటికీ, అది ఓ గేమ్ ఛేంజర్‌గా కూడా ఆతిథ్యరంగ పరిశ్రమకు నిలిచింది. ఈ తరహా పరిస్థితులు, మనందరికీ ఆలోచనా పరిమితులను కలిగి ఉండాలని హెచ్చరించడమే కాదు, మారుతున్న వినియోగదారుల అభిరుచులను ముందుగానే గ్రహించాలని, డ్రాయింగ్ బోర్డ్‌కు తిరిగి రావడంతో పాటుగా వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు అనువుగా తమ వినియోగదారుల సేవలను సైతం మార్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది.
ఈ మారుతున్న వాతావరణాన్ని ఒడిసిపట్టుకునే క్రమంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద పిజ్జా గొలుసుకట్టు సంస్థ లిటిల్ సీజర్స్ పిజ్జా ఇప్పుడు భారతదేశంలో తమ ఫ్రాంచైజీల సహాయంతో మెరుగైన శుభ్రత, భద్రత, కాంటాక్ట్‌లెస్ అనుభవాలను అందించడంతో పాటుగా భారతదేశంలో ఎక్కడైనా సరే అత్యంత అందుబాటు ధరలలో భోజనాలను కోరుకునే వినియోగదారులకు సేవలను అందించడానికి సిద్ధమైంది.
భద్రత మరియు శుభ్రత పరంగా అత్యున్నత ప్రమాణాలను అనుసరించడం ద్వారా ఈ బ్రాండ్ చిరపరిచితం. ఇప్పుడు తమ హాట్-ఎన్-రెడ్ నమూనాను వినియోగదారులకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఉంది. ఇది వినియోగదారులకు 30 సెకన్లు లేదా అంతకన్నా తక్కువ సమయం మాత్రమే స్టోర్ లోపల మరియు బయట ఉండేలా అనుమతిస్తుంది. తద్వారా మహమ్మారి వేళ వినియోగదారులకు సురక్షితంగా ఉంటూనే సౌకర్యవంతమైన అనుభవాలనూ అందిస్తుంది.
అంతర్జాతీయ క్యుఎస్‌ఆర్ సంస్ధ తమ పిజ్జాలన్నీ కూడా ఓవెన్‌లో బేక్ చేయబడతాయని, 254 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ఇవి చేరుకుంటాయనే భరోసా అందిస్తుంది. అంతేకాదు, ఓవెన్ నుంచి పిజ్జా బయటకు వచ్చిన తరువాత నేరుగా బాక్స్‌లోనే చేరుతుందనే భరోసానూ అందిస్తుంది. తద్వారా కోవిడ్ 19 మహమ్మారి వేళ వినియోగదారులకు భరోసానూ అందిస్తుంది.