వంట గ్యాస్ సిలిండర్ ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తగ్గించింది. గత రెండు మూడు నెలలుగా రూ.100 మేరకు వంట గ్యాస్ ధరను పెంచిన ఐఓసీ.. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి రూ.10 తగ్గించింది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఫిబ్రవరిలో వరుసగా ధరల పెరుగుదల ప్రభావంతో ఉన్న గృహిణులకు ఉపశమనం కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఈ క్రంలో ఏప్రిల్ 1 నుంచి సిలిండర్‌పై రూ.10 తగ్గించింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బుధవారం సిలిండర్ ధరలో రూ.10 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్, డీజిల్ ధరలను ఇప్పటికే వారంలో మూడుసార్లు తగ్గించినప్పటికీ, వంట గ్యాస్ ధర కూడా సమీప భవిష్యత్తులో తగ్గుతాయని చమురు అధికారులు పేర్కొంటున్నారు.