వంటగ్యాస్ ధరలకు రెక్కలు.. సిలిండర్‌పై రూ.50 పెంపు

మంగళవారం, 22 మార్చి 2022 (09:29 IST)
వంటగ్యాస్ మళ్లీ పెరగనున్నాయి. దీంతో వినియోగదారులకు షాక్ తప్పలేదు. అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన కారణంగా  దేశీయ వంట గ్యాస్ ధర మంగళవారం సిలిండర్‌కు రూ.50 చొప్పున పెరిగింది. 
 
పెరిగిన గ్యాస్‌ ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నట్లు చమురు సంస్థలు వెల్లడించాయి. పెరిగిన ధరలతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు ఢిల్లీలో రూ.949.50గా ఉంది. గత సంవత్సరం అక్టోబర్‌ తర్వాత ఎల్పీజీ రేట్లను పెంచడం ఇదే తొలిసారి.  
 
పెంచిన ధరలతో 5 కేజీల ఎల్పీజీ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 349 కాగా, 10 కిలోల కాంపోజిట్ బాటిల్ రూ. 669గా ఉంది. 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర ఇప్పుడు రూ. 2003.50గా ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు