వంట గ్యాస్ వినియోగదారులకు శుభవార్త... సిలిండర్ ధర తగ్గింపు.. కానీ,

మంగళవారం, 1 జూన్ 2021 (15:16 IST)
దేశంలోని వంట గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను చెప్పాయి. జూన్ నెల ఒకటో తేదీ వంట గ్యాస్ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ప్రతి నెల ఒకటో తేదీన వంట గ్యాస్ ధరలను సమీక్షించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ కోవలో మంగళవారం ఈ ధరను సమీక్షించిన ఆయిల్ కంపెనీలు గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి. అయితే, ఇది కేవలం వాణిజ్యపరమైన వంట గ్యాస్‌కే వర్తింపజేసి.. గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్‌ ధరను మాత్రం తగ్గించలేదు. 
 
తాజా నిర్ణయం మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్‌ ధరను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ఐఓసీ వెబ్‌సైట్ ప్రకారం.. 19 కిలోల కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.122 దిగొచ్చింది. దీంతో ఢిల్లీలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1473కు తగ్గింది. అలాగే మే నెలలో కూడా గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.45 మేరకు తగ్గించగా, ముంబైలో 19 కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1422కు తగ్గింది. ఇక కోల్‌కతాలో కూడా సిలిండర్ ధర రూ.1544కు తగ్గింది. చెన్నైలో సిలిండర్ ధర రూ.1603కు తగ్గింది.
 
అలాగే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో మాత్రం ఈ నెలలో ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో సిలిండర్ ధర రూ.809 వద్ద ఉండగా, కోల్‌కతాలో రూ.835 వద్ద ఉంది. ముంబైలో సిలిండర్ ధర రూ.809 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో గ్యాస్ సిలిండర్ ధర రూ.825 వద్ద ఉంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు