అంతేకాకుండా, ఇకపై ప్రతీ 15 రోజులకు ఒకసారి గ్యాస్ ధరలు సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఇంధన ధరలు సవరిస్తున్న ప్రభుత్వం అదే విధానాన్ని గ్యాస్‌పైనా అమలు చేయాలని యోచిస్తోంది. అందులో భాగంగానే నేటి నుంచి ధరల పెంపు అమలు మొదలుపెట్టింది. అంటే మరో 15 రోజుల తర్వాత మరోమారు బాదుడు ఉంటుందన్న మాట.