పెట్రోల్ ధరల పెరుగుదలకు అడ్డుకట్ట లేదా? మళ్లీ పెంపు

గురువారం, 11 ఫిబ్రవరి 2021 (10:25 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల పెరుగుదలకు అడ్డుకట్ట లేకుండా పోతోంది. వరుసగా మూడో రోజు కూడా ఈ ధరలు పెరిగాయి. పెట్రోల్‌, డీజిల్‌పై 32 పైస‌ల చొప్పున పెంచుతున్న‌ట్లు చ‌మురు కంపెనీలు ప్ర‌క‌టించాయి. ఢిల్లీలో పెట్రోలు లీట‌రుకు 25 పైస‌లు, డీజిల్‌పై 30 పైస‌లు పెరిగింది. దీంతో అక్క‌డ లీట‌రు పెట్రోలు రూ.87.85, డీజిల్ రూ.78.03కి చేరింది. ముంబైలో లీట‌రు పెట్రోలు రూ.94.36, డీజిల్ రూ.84.94కి చేరింది. 
 
గుంటూరులో లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.93.93, డీజిల్ ధ‌ర రూ.87.20గా ఉంది. విజ‌య‌వాడ‌లో లీటరు పెట్రోల్ ధ‌ర రూ.93.73కి, లీట‌రు డీజిల్ ధ‌ర రూ.87కి పెరిగింది. హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర 26 పైస‌లు పెరిగి రూ.91.35కి చేరింది. అలాగే, డీజిల్ ధ‌ర లీట‌రుకి 32 పైస‌లు పెరిగి రూ.85.11కి పెరిగింది.
 
ఇదిలావుండగా, హైదరాబాద్‌లో గురువారం లీటర్ పెట్రోల్ ధర 26 పైసలు పెరిగి రూ.91.35కి చేరుకుంది. డీజిల్ ధర రూ.85.11గా ఉంది. వాణిజ్యరాజధాని ముంబైలో పెట్రోల్ ధర గరిష్టస్థాయిని తాకింది. పెట్రోల్ ధర ఇక్కడ రూ.94.36కు చేరుకుంది. 
 
కోల్‌కతాలో రూ.89.16, చెన్నైలో రూ.90.19గా ఉంది. డీజిల్ ధర ముంబైలో లీటర్‌కు రూ.84.94, కోల్‌కతాలో రూ.81.61, చెన్నైలో రూ.83.16కు చేరుకుంది. జైపూర్‌లో పెట్రోల్ రూ.94.25, డీజిల్ రూ.86.27కు చేరింది. తాజా పెంపుతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు పెట్రోల్‌ డీజిల్‌పై సుమారు రూ.4 వరకు పెరిగింది. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు