ఇష్టమైన మహీంద్రా వాహనం ఇప్పటికిపుడే సొంతం చేసుకోవచ్చు.. ఎలా?

బుధవారం, 2 జూన్ 2021 (19:18 IST)
కరోనా లాక్డౌన్ కారణంగా అన్న రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయింది. దీంతో ఈ రంగానికి తిరిగి ప్రాణం పోసేందుకు పలు దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీలు నడుం బిగించాయి. ఇందులోభాగంగా, మహీంద్రా సంస్థ వినూత్నమైన ఆఫర్ ప్రకటించింది. 
 
ఇప్పుడు వాహనాలు కొంటే, మూడ్నెళ్ల తర్వాత ఈఎంఐలు కట్టుకోవచ్చంటూ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొనుగోలుదారులు తమకు ఇష్టమైన మహీంద్రా వాహనాన్ని ఇప్పటికిప్పుడే సొంతం చేసుకోవచ్చని తెలిపింది. కొనుగోలు సమయంలో ఈఎంఐ చెల్లించాల్సిన పనిలేదని, మూడు నెలల తర్వాత మొదటి ఈఎంఐ చెల్లించవచ్చంటూ తన ఆఫర్‌ను వివరించింది.
 
అంతేకాదు, కొనుగోలుదారులను ఆకర్షించేలా తన 'ఒన్ లైన్' ప్లాట్ ఫామ్ ద్వారా రుణ సదుపాయం, క్యాష్ బ్యాక్ ఆఫర్లు, రూ.3 వేల విలువైన యాక్సెసరీస్, లోన్ సమయంలో రూ.2 వేల విలువైన బెనిఫిట్స్... ఇలా అనేక ఆఫర్లు ప్రకటించింది. వాహనానికి సంబంధించిన వారెంటీ పొడిగింపు, యాక్సెసరీస్ వ్యయం, వర్క్ షాపు చార్జీలు వంటి ఇతర చెల్లింపులను కూడా వాయిదాల పద్ధతిలో చెల్లించేందుకు వీలు కల్పించనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు