ఆమె కట్టెల పొయ్యి మీద ఇడ్లీలు చేస్తూ పేదలు, కూలీలకు కేవలం రూ.1కే ఒక ఇడ్లీ అమ్మేది. ఆమె అలా 30 ఏళ్ల నుంచి ఇడ్లీలను తయారు చేసి అందిస్తోంది. అయితే ఆమె వీడియో వైరల్ అయ్యాక ఆమెకు సహయం చేసేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.
అప్పట్లో ఆమె తనకు ఓ ఇల్లు ఉంటే బాగుండునని, దీంతో మరింత మందికి ఇడ్లీలను విక్రయించేదాన్నని చెప్పింది. ఆమె కోరిక తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా ఆమెకు ఇంటిని అందజేశారు. ఆమెకు ఇంటిని అందించినందుకు గాను నెటిజన్లు ఆనంద్ మహీంద్రాను కొనియాడుతున్నారు.