ఈ ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా మెడిబడ్డీ Heart Your Own Heart ప్రచారం

బుధవారం, 27 సెప్టెంబరు 2023 (23:00 IST)
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని, భారతదేశపు అతిపెద్ద డిజిటల్ హెల్త్‌కేర్ ప్లాట్‌ఫారమ్ అయిన మెడిబడ్డీ, వ్యక్తులను తమ గుండె ఆరోగ్యం గురించి ఆలోచించుకోవడానికి ఒక క్షణం కేటాయించమని ఆహ్వానిస్తుంది మరియు ప్రతి ఒక్కరినీ #HeartYourOwnHeartకి ప్రోత్సహిస్తుంది. ఈ ప్రచారం వ్యక్తులు తమ గుండె ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మరియు ఆరోగ్యకరమైన హృదయానికి తగిన  జీవనశైలి ఎంపికలను చేయాలని కోరుతుంది. 
 
ఈ  ప్రచారం  గురించి  మెడిబడ్డీ-  మార్కెటింగ్, భాగస్వామ్యాలు మరియు PR హెడ్ శ్రీ సాయిబల్ బిస్వాస్ మాట్లాడుతూ, “మీ హృదయం మీ అత్యంత ముఖ్యమైన అవయవం.  గుండె-ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం,  చురుకుగా ఉండటం , ధూమపానం మానేయడం , ఒత్తిడిని నిర్వహించడం , తరచుగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవటం చేయాలని ఈ ప్రచారం ప్రజలను కోరుతుంది. ప్రపంచ హృదయ దినోత్సవం మనందరికీ ఆరోగ్యకరమైన హృదయం వైపు చురుకైన అడుగులు వేయడానికి ఒక రిమైండర్‌గా పనిచేస్తుంది. మెడిబడ్డీలో, గుండె ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ద్వారా, ప్రజలు ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాలను గడపడానికి మేము సహాయపడగలమని నమ్ముతున్నాము" అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు