ఈ సందర్భంగా సిద్స్ ఫార్మ్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కిశోర్ ఇందుకూరి మాట్లాడుతూ, మా మహిళా ఉద్యోగుల నుంచి మేము అతి గొప్ప పురోగతిని చూశాము. మా సంస్థను మరింత అనుకూలమైన, లింగసమానత్వం కలిగిన సంస్ధగా మలుస్తామనే మా వాగ్దానం నెరవేర్చడంలో మరో ముందడుగుఅని అన్నారు
ఆయనే మాట్లాడుతూ, శ్రామిక శక్తి పరంగా మహిళలు ఎప్పుడూ ముందే ఉంటారు. వారి శక్తిని గుర్తించడం ద్వారా మరింత మంది వినియోగదారుల చెంతకు మేము చేరగలుగుతున్నాము. అదే సమయంలో ఉదయమే డెలివరీలను సైతం చేయగలుగుతున్నాము. కేవలం మగవారు మాత్రమే పాల డెలివరీ చేయగలరనే భావనను మేము పోగొట్టడంతో పాటుగా మిల్క్ మెన్ అనే పదాన్ని సవాల్ చేస్తున్నాం అని అన్నారు.