తెలంగాణా వాసుల కోసం యాప్‌ను విడుదల చేసిన సిద్స్‌ ఫార్మ్‌

సోమవారం, 16 ఆగస్టు 2021 (23:04 IST)
తెలంగాణా కేంద్రంగా కలిగిన ప్రీమియం పాలు, పాల ఉత్పత్తుల బ్రాండ్‌ సిద్స్‌ ఫార్మ్‌, తెలంగాణా వాసుల కోసం ప్రత్యేకంగా యాప్‌ను విడుదల చేసింది. సహజసిద్ధమైన పాలు, నిత్యావసరాలను ప్రతి రోజూ ఇంటి ముంగిటనే అందుకోవాలనుకునే వారి అవసరాలను ఇవి తీరుస్తాయి.
 
తొలుత హైదరాబాద్‌ వాసులకు ఈ సేవలను అందించనున్నారు. వినియోగదారులు అత్యంత సౌకర్యవంతంగా తమ ఇంటి నుంచి ఆవు పాలు, గేదె పాలు, నెయ్యి, వెన్న, పన్నీర్‌, ఆవు పెరుగు, గేదె పెరుగు పొందవచ్చు. ప్రతి రోజూ రాత్రి 10 గంటల లోపు ఆర్డర్‌ చేస్తే ఉదయం 7 గంటలకు తమ ఇంటి ముంగిట వాటిని అందుకోవచ్చు. వినియోగదారులు ఈ యాప్‌ను ప్లేస్టోర్‌, ఐఓఎస్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
 
ఈ సందర్భంగా సిద్స్‌ ఫార్మ్‌ ఫౌండర్‌ శ్రీ  కిశోర్‌ ఇందుకూరి మాట్లాడుతూ ‘‘వినియోగదారుల ప్రవర్తన పరంగా గణనీయమైన మార్పులను చూస్తున్నాం. పూర్తిసరికొత్త జీవనవిధానం వారు  అనుసరిస్తున్నారు. అదీ గాక ఈ మహమ్మారి వారి జీవితాలను  సౌకర్యవంతంగా మార్చింది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో ఆర్డరింగ్‌ను సౌకర్యవంతంగానూ భావిస్తున్నారు’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ ‘‘డెలాయిట్‌ యొక్క గ్లోబల్‌ స్టేట్‌ ఆఫ్‌ కన్స్యూమర్‌ ట్రాకర్‌ అధ్యయనం వెల్లడించే దాని ప్రకారం 70% మంది భారతీయులు సౌకర్యం కోరుకుంటున్నారు. ఆ సౌకర్యం కోసమే అధికంగా  ఖర్చు చేయాలనీ చూస్తున్నారు. ఈ సౌకర్యం కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని సృజనాత్మక మార్గాలను అన్వేషించడం ద్వారా  వినియోగదారులకు అదనపు విలువనూ అందిస్తున్నాం’’ అని అన్నారు.
 
ఈ కంపెనీ, వినియోగదారులకు అతి స్వచ్ఛమైన పాలను అందిస్తుంది. ఈ పాలలో హార్మోన్లు, నిల్వ కారకాలు, యాంటీ బయాటిక్స్‌ లేవు. ఈ బ్రాండ్‌కు ఈ ప్రాంతంలో 100కు పైగా స్టోర్లు ఉన్నాయి మరియు బిగ్‌బాస్కెట్‌, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ వంటి వేదికల ద్వారా కూడా లభ్యమవుతుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు