మూడు రాజధానులపై బుగ్గన ఏమన్నారు..?

గురువారం, 24 మార్చి 2022 (17:38 IST)
మూడు రాజధానుల అంశంపై అసెంబ్లీలో చర్చ జరిగింది. దీనిపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పోల్చితే ఏపీలో తలసరి ఆదాయం పడిపోయిందని బుగ్గన వెల్లడించారు.
 
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయని బుగ్గన తెలిపారు. ప్రాదేశిక హక్కులు, ఆదేశ సూత్రాలు చాలా ముఖ్యమైనవని, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని అన్నారు. ఒకరి హక్కును మరొకరు లాక్కోరాదని పేర్కొన్నారు. 
 
రాష్ట్ర ఆదాయం మాత్రమే కాదు.. ఈ అసమానతలు అనేక రంగాల్లో ఉన్నాయని బుగ్గన తెలిపారు. స్థూల వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఇదే తీరు అని బుగ్గన పేర్కొన్నారు. 
 
ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించాలని రాజ్యాంగంలో స్పష్టం చేశారని వివరించారు. తద్వారా మూడు రాజధానుల ఏర్పాటు ఆవశ్యకతను నొక్కి చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు