ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బూస్ట్ లాంటి వార్తను అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ అందించింది. అంతర్జాతీయ పెట్టుబడులకు భారత్ అనుకూలమంటూ మూడీస్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ స్పష్టంచేస్తూ, ప్రస్తుతం ఉన్న రేటింగ్‌ను బీఏఏ 3 నుంచి బీఏఏ 2కి సవరించింది. అలాగే, స్వల్పకాలిక కరెన్సీ రేటింగ్ ను పీ-3 నుంచి పీ-2కి మార్చింది.
అలాగే, 2017-18 ఆర్థిక సంవత్సరానికిగాను భారత్ జీడీపీ వృద్ధిరేటు 6.7శాతంగా ఉంటుందని తెలిపింది. మోడీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నాయని.. అంతర్జాతీయ పెట్టుబడులకు అనుకూలం అని తెలిపింది. 14 సంవత్సరాల తర్వాత మూడీస్ ఏజెన్సీ భారత్‌కు మెరుగైన రేటింగ్ ఇవ్వడం తొలిసారి కావడం గమనార్హం.