పెట్రోల్ బాదుడు... కనీస ఛార్జీ పెంచేసిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు

సోమవారం, 22 ఫిబ్రవరి 2021 (17:18 IST)
పెట్రోల్ బాదుడు కారణంగా ఆటో ఛార్జీలు, ట్యాక్సీ ఛార్జీలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్ ధరలు సామాన్యులకు మరో షాక్ ఇచ్చాయి. ముంబైలో ఆటో, ట్యాక్సీల ఛార్జీలు పెరిగాయి. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్‌)లో కనీస ఛార్జీపై రూ.3 పెంచారు. ఇప్పటి వరకూ ఆటోల్లో కనీస ఛార్జీ రూ.18గా ఉండగా.. ఇక నుంచి అది రూ.21కి చేరనుంది. 
 
ఇక ఖాళీపీలీ ట్యాక్సీల్లో కనీస ఛార్జీ రూ.22 నుంచి రూ.25కు పెరిగింది. ఇంధన ధరలతోపాటు మెయింటెనెన్స్‌, ఇన్సూరెన్స్ ధరలు పెరిగినా.. ఐదేళ్లుగా ఛార్జీలు పెంచలేదని ఆటో డ్రైవర్లు చెప్పారు. ఈ తాజా పెంపును ముంబై, థానె, నవీ ముంబైలలోని ఆటో డ్రైవర్ అసోసియేషన్లు స్వాగతించాయి. ముంబైలో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.97 మించిపోగా.. డీజిల్ రూ.88 మార్క్ దాటింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు