ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించిన ముత్తూట్ ఎగ్జిమ్

శనివారం, 28 అక్టోబరు 2023 (19:16 IST)
భారీ వ్యాపార సమ్మేళనం ముత్తూట్ పప్పచన్ గ్రూప్ (దీనిని ముత్తూట్ బ్లూ అని కూడా పిలుస్తారు) యొక్క విలువైన లోహపు విభాగం, ముత్తూట్ ఎగ్జిమ్ (P) లిమిటెడ్, తమ నూతన కేంద్రం ను G.S. రావు కాంప్లెక్స్, డోర్ నెంబర్ 6-6-10, గ్రౌండ్ ఫ్లోర్, టి.నగర్, కోటిపల్లి బస్టాండ్ దగ్గర, రాజమండ్రి వద్ద కొత్త ముత్తూట్ గోల్డ్ పాయింట్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ గోల్డ్ పాయింట్ సెంటర్ రాష్ట్రంలో ముత్తూట్ ఎగ్జిమ్ ప్రారంభించిన మూడవ సెంటర్ అవుతుంది. వినియోగదారులకు తమ బంగారాన్ని విక్రయించడానికి విశ్వసనీయమైన మరియు నమ్మకమైన కేంద్రాన్ని అందించాలనే లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేసింది.
 
ఇక్కడ వినియోగదారులు తమ బంగారాన్ని సౌకర్యవంతమైన, పారదర్శక విధానములో విక్రయించవచ్చు. ఈ కొత్త బ్రాంచ్‌తో, కంపెనీ ఈరోజు భారతదేశంలో 18 గోల్డ్ పాయింట్ సెంటర్‌లను కలిగి ఉంది, ఇందులో రెండు 'మొబైల్ ముత్తూట్ గోల్డ్ పాయింట్' సెంటర్లు కూడా వున్నాయి. ఇవి కస్టమర్ల ఇంటి నుండి బంగారాన్ని సేకరిస్తాయి. ముత్తూట్ ఎగ్జిమ్, తమ గోల్డ్ పాయింట్ సెంటర్‌ల ద్వారా, పాత మరియు ఉపయోగించిన బంగారు వస్తువులను నేరుగా వినియోగదారుల నుండి కొనుగోలు చేస్తాయి, తరువాత వాటిని తిరిగి ప్రాసెస్ చేసి, శుద్ధి చేసి, దేశీయ వినియోగానికి సరఫరా చేస్తారు.
 
ఈ కేంద్ర ప్రారంభోత్సవం గురించి ముత్తూట్ ఎగ్జిమ్ సీఈఓ  కేయూర్ షా వ్యాఖ్యానిస్తూ, “విలువైన లోహాల వ్యాపారంలో రాజమండ్రి కీలకమైన మార్కెట్లలో ఒకటి గా వెలుగొందుతుంది, మరియు ఈ ఆశాజనక నగరంలో మా సేవలను అందించడానికి మేము సంతోషిస్తున్నాము. మా సేవలు అవసరమయ్యే మరింత మంది కస్టమర్‌లను చేరుకోవడానికి ఈ నూతన బ్రాంచ్ మాకు సహాయం చేస్తుంది. ఈ చర్య, మా వినియోగదారులకు పారదర్శకమైన మరియు శాస్త్రీయమైన పరీక్ష మరియు బంగారాన్ని అంచనా వేసే ప్రత్యేక మరియు పరిశ్రమ-మొదటి ప్రక్రియను అందించాలనే మా నిరంతర నిబద్ధతలో భాగం. బంగారం రీసైక్లింగ్‌ను ప్రోత్సహిస్తూ, సామాన్యులు తమ ఆస్తిని ఉత్పాదక వినియోగంలో ఉంచడంలో సహాయపడాలనే మా లక్ష్యం ను ఇది ప్రతిబింబిస్తుంది, తద్వారా దేశంలోకి బంగారం దిగుమతులను తగ్గించాలనే భారత ప్రభుత్వ ఆలోచనకు ఇది దోహదపడుతుంది..." అని అన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు