తమ బ్రాండ్ అంబాసిడర్ శ్రద్ధాకపూర్ నటించిన టీవీసీని విడుదల చేసిన మైగ్లామ్
సోమవారం, 2 ఆగస్టు 2021 (21:08 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న డీటీసీ బ్యూటీ మరియు పర్సనల్ కేర్ బ్రాండ్ మైగ్లామ్ తమ మొట్టమొదటి జాతీయ టీవీసీని మీరు ఏం కోరుకుంటున్నారో మై గ్లామ్‌కు చెప్పండి (టెల్ మైగ్లామ్ వాట్ యు వాంట్) నేపథ్యంతో విడుదల చేసింది. ఈ ప్రచారంలో, నూతనంగా నియమించబడిన బ్రాండ్ అంబాసిడర్ మరియు ఇన్వెస్టర్ శ్రద్ధాకపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ఎన్నో సంవత్సరాలుగా, మహిళలు తమ అందమైన కథలను మరియు కోరికలను పంచుకునే వేదికను మైగ్లామ్ నిర్మించడంతో పాటుగా ఈ పరిజ్ఞానంతోనే తమ ఉత్పత్తులను మైగ్లామ్ సృష్టిస్తుంది. తమకు ఏమి కావాలో బ్రాండ్‌కు తెలిపే శక్తిని వినియోగదారులకు అందించడం ద్వారా బ్యూటీ డెమోక్రసీని సృష్టించాలనే లక్ష్యంతో మైగ్లామ్ కృషి చేస్తుంది. తద్వారా భారతదేశంలో మహిళలు తమ బ్యూటీ ఉత్పత్తులను కొనుగోలు చేసే అనుభవాలను సంపూర్ణంగా మార్చనుంది.
ఈ ప్రచారం ద్వారా ఉత్పత్తుల సృష్టిలో మహిళలు చురుగ్గా పాల్గొనాల్సిన ఆవశ్యకతను ప్రధానంగా వెల్లడిస్తున్నారు. తద్వారా వారి అందపు అవసరాలకు తగిన పరిష్కారాలనూ తెలుసుకోవచ్చని వెల్లడిస్తున్నారు. ఈ చిత్రంలో రహస్యమే అయినప్పటికీ వినోదాత్మక సంభాషణ శ్రద్ధా కపూర్ మరియు ఓ రహస్య శ్రోత నడుమ జరుగడం జరుగుతుంది. వారు ఈ చిత్రంలో తమ సౌందర్య ప్రకాశానికి కారణమయ్యే అంశాలను గురించి వారెలా తెలుసుకున్నారు, ఏ తరహా లిప్‌స్టిక్ తమకు అత్యుత్తమంగా సరిపోతుంది లాంటి అంశాలను గురించి చర్చిస్తుంటారు.
తద్వారా ఆమె భాగస్వామి దృష్టిని ఆకర్షించడంతో ఎవరితో మాట్లాడుతున్నావంటూ ఆమెను ఆరా తీస్తారు, ఆమె మాట్లాడేది మైగ్లామ్‌తో! వినియోగదారులు తమ అందపు అవసరాలను గురించి బ్రాండ్‌తో ఏ విధంగా తెలుపవచ్చనేది వినియోగదారులకు తెలుపడంతో ఈ చిత్రం పూర్తవుతుంది. ఈ టీవీసీ ద్వారా, మహిళలు చెప్పేది వినేందుకు అత్యుత్తమ శ్రోతగా నిలువడమే కాదు మైగ్లామ్ పై వినోదాత్మక క్రీడ ద్వారా మహిళలు సైతం వెల్లడించడానికి ఇష్టపడతారని చూపుతారు. ఇది ఈ ప్రచార ప్రధాన సందేశం- మీకు ఏం కావాలన్నది, మైగ్లామ్‌కు చెప్పండికు ప్రాతినిధ్యం వహిస్తుంది. వినియోగదారుల కోసం మై గ్లామ్ అందించే ఉత్పత్తులు, మేకప్, స్కిన్‌కేర్, వ్యక్తిగత సంరక్షణ విభాగాలలో ఉంటాయి. వీటిని అత్యంత ఆకర్షణీయంగా ఈ చిత్రంలో చూపారు. ఇవి చిన్నగానే అయినప్పటికీ మహిళల ప్రతి రోజూ జీవితంలో అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంటాయి.
నేటి మిల్లీనియల్ మహిళలు, తమను తాము వ్యక్తీకరించుకుంటారు మరియు నియంత్రణలో ఉంటూనే ఉల్లాసభరితంగా మరియు అకస్మికంగా తాము చేయాలనుకున్నది చేస్తారు. ధైర్యం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిధ్వనింపజేస్తూనే స్త్రీత్వం మరియు మనోహరతను ప్రదర్శించే మిల్లీనియల్ మహిళల వైఖరిని మై గ్లామ్ ఈ ప్రచారం ద్వారా గుర్తిస్తుంది.
మైగ్లామ్ కోసం, బ్రాండ్ సిద్ధాంతంలో అత్యంత కీలకంగా వినియోగదారులు ఉంటారు మరియు ఆమెను వేడుక చేసుకునే విశ్వాన్ని సృష్టించడంను వారి ప్రాథమిక లక్ష్యంగానూ ఇది మలుస్తుంది. ఈ విశ్వం, మైగ్లామ్ జో ఇన్‌సైడర్‌గా పిలువబడే వినూత్నమైన ప్రోపర్టీతో శక్తివంతమవుతుంది. మైగ్లామ్ మరియు పాప్జో యొక్క ఉమ్మడి లాయల్టీ కార్యక్రమమిది. ఇక్కడ మహిళలు తమ కలల బ్యూటీ ఉత్పత్తి గురించి చెబుతారు.
మేకప్ మొదలు స్కిన్‌కేర్ వరకూ ప్రతి మహిళా తమ సొంత కథను వెల్లడించే బ్యూటీ ఉత్పత్తి కావాలని కోరుకుంటుంటుంది మరియు ఓ బ్రాండ్‌గా, మైగ్లామ్ ఆ వినియోగదారులు తమకు ఏమి కావాలనుకుంటున్నారో వెల్లడించే అంశాలను ఆలకించే సౌండ్‌బోర్డ్‌గా వ్యవహరిస్తుంది. వినియోగదారులు వెల్లడించిన ఈ అంశాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మా పరిశోధనా ల్యాబ్‌లకు తీసుకువెళ్లడంతో పాటుగా విన్నూతమైన, అత్యంత సమర్థవంతమైన మరియు మీకు చక్కగా ఉపయోగపడే సూత్రాలతో తీర్చిదిద్దిన ఉత్పత్తులను తీసుకువస్తుంటాం.ఈ ఉత్పత్తులు లక్షలాది మహిళల బ్యూటీ అవసరాలకు తగిన పరిష్కారాలను అందించనున్నాయి. మైగ్లామ్ ద్వారా అందాన్ని పునర్నిర్వచించే కొత్త ప్రపంచాన్ని నా అందం. నా మార్గం ! అంటూ స్వీకరించండి.
ఈ ప్రచారం గురించి మైగ్లామ్ సీఈఓ, అప్రితమ్ మజుందార్ మాట్లాడుతూ, ఈ ప్రచారం గురించి నేను అమితాసక్తితో ఉన్నాను. మరింత మంది ప్రజల చెంతకు దీనిని తీసుకువెళ్లే అవకాశం కల్పించడంతో పాటుగా చిన్నగానే అయినా వాటి అందపు ప్రయాణంలో సానుకూలంగా ప్రభావం చూపనుంది. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచంలో, మేము మా అంతర్ర్గాహక కథ, ఆశను వెల్లడించడంతో పాటుగా ప్రజలు సైతం తమ కథలను వెల్లడించేలా స్ఫూర్తిని కలిగిస్తున్నాం అని అన్నారు.
నటి శ్రద్ధా కపూర్ మాట్లాడుతూ, మైగ్లామ్ యొక్క మొట్టమొదటి టీవీసీలో భాగం కావడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ బ్రాండ్ ఫిలాసఫీని మరియు మహిళలు కోరుకుంటున్న ఉత్పత్తులను సృష్టించడంలో వారు అనుసరిస్తున్న విధానాన్ని నేను ప్రతిబింబించగలను. అదే ఈ ప్రచారంలోనూ కనిపిస్తుంది. మైగ్లామ్ ద్వారా నా అభిమానులు మరియు అనుసరణీయుల బ్యూటీ అవసరాలను తీర్చడంతో పాటుగా అర్థం చేసుకోగలనని ఆశిస్తున్నాను అని అన్నారు.
అభిజిత్ అవాస్థీ, కో-ఫౌండర్, సైడ్‌వేస్ మాట్లాడుతూ, మహిళలు మరియు వారి అందపు అవసరాల కోసం టెక్నాలజీ, డాటా ఏం చేయగలదనే దానికి అత్యద్భుతమైన ఉదాహరణగా మైగ్లామ్ నిలుస్తుంది. మహిళలు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోవడం దగ్గర నుంచి, వారి కోసం ఉత్పత్తులను తీర్చిదిద్దడం వరకూ వారు అనుసరిస్తున్న విధానాన్ని వారి వినియోగదారులు అమితంగా ఆదరిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా మరింత మంది ఈ ఉత్పత్తులను ఆస్వాదించడంతో పాటుగా తమ బ్యూటీ కోరికలను సైతం పంచుకోగలరని ఆశిస్తున్నాము. మైగ్లామ్‌తో 2017లో ఉత్పత్తి/ప్యాకేజింగ్ అభివృద్ధి దశ నుంచి సైడ్‌వేవ్స్ భాగస్వామ్యం చేసుకుంది. అందువల్ల, వారి ప్రయాణం మొదలు మొదటి టీవీసీ విడుదల వరకూ ప్రయాణం చూడటం చాలా సంతృప్తికరంగా ఉంది అని అన్నారు.