ఏటీఎంలలో మీకు రూ.200 నోటు రాదు. ఎందుకంటే... ఆ నోటును స్కాన్ చేసే సాఫ్ట్‌వేర్ ఏటీఎంలలో అందుబాటులో లేదు. గత సంవత్సరం నవంబర్ 8వ తేదీన దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసిన తర్వాత కొత్తగా రూ.500, రూ.2000 నోట్లను తీసుకొచ్చారు అయితే.. కొత్త నోట్లు వచ్చినా.. వాటిని గుర్తించే సాఫ్ట్‌వేర్ ఏటీఎంలలో లేకపోవడంతో ప్రజలు డబ్బుల కోసం దేశ ప్రజలంతా తల్లడిల్లిపోయారు.
ఇక.. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతున్నది. రూ.200 చలామణిలోకి వచ్చినా.. బ్యాంకులకు వెళ్లి తీసుకోవాల్సిందే తప్ప... ఇప్పటికిప్పుడు ఏటీఎంలలో మాత్రం కనిపించవు. ఈ ప్రాసెస్ అంతా పూర్తవ్వడానికి కన్సికం ఓ నెల రోజులైనా పడుతుందట. అద్గదీ సంగతి. సో.. కొత్త రూ.200 నోటును ఏటీఎంలో చూడాలంటే నెల ఎదురు చూడాలి. లేదంటే బ్యాంకులకెళ్లి తెచ్చుకోవాల్సిందే.