ఫోటోగ్రఫీ ఔత్సాహికుల కోసం రాజమండ్రిలో నికాన్‌ ఇండియా నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభం

గురువారం, 18 మే 2023 (21:30 IST)
ఇమేజింగ్‌ టెక్నాలజీలో అగ్రగామి నికాన్‌ కార్పోరేషన్‌కు 100% అనుబంధ సంస్థ అయిన నికాన్‌ ఇండియా, తమ నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి వద్ద ప్రారంభించింది. ఇది జైన్‌ డిజిటల్‌ షాపీ, స్టేడియం రోడ్‌, ఇన్నీస్‌పేట వద్ద ఉంది. ఈ ఎక్స్‌పీరియెన్స్‌ జోన్‌ను నేడు నికాన్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ సజ్జన్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీ ప్రతిభకు నికాన్‌ యొక్క ప్రపంచ శ్రేణి ఉత్పత్తులతో కూడిన నిధిని ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ అందుబాటులోకి తీసుకురానుంది.
 
రాజమండ్రిలోని నికాన్‌ యొక్క ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ అత్యంత సౌకర్యవంతంగా మరియు లీనమయ్యే అనుభవాలను అందించే రీతిలో తీర్చిదిద్దబడింది. ఇక్కడ విస్తృతశ్రేణిలో ఉత్పత్తులు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. వీటిలో నికాన్‌ యొక్క విప్లవాత్మక మిర్రర్‌ లెస్‌ సిరీస్‌ ,  డీ–ఎస్‌ఎల్‌ఆర్‌ శ్రేణి కెమెరాలతో పాటుగా హై జూమ్‌ కూల్‌పిక్స్‌ కెమెరాలు, లెన్స్‌లు, యాక్ససరీలు మరియు నికాన్‌ సపోర్ట్‌ ఆప్టిక్స్‌ శ్రేణి వంటివి ఉంటాయి. నికాన్‌ ఇండియా గతంలో పలు ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ కేంద్రాలను భారతదేశ వ్యాప్తంగా ప్రారంభించడం ద్వారా ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కమ్యూనిటీ అవసరాలను తీరుస్తుంది. ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ద్వారా వినియోగదారులకు లీనమయ్యే మరియు అనుసంధానిత అనుభవాలను నికాన్‌ ఉత్పత్తులతో అందిస్తుంది. తద్వారా వారు తమ సృజనాత్మకతను వెలుపలికి తీయడంతో పాటుగా ఆవిష్కరణ,  ఊహలతో ఫోటోగ్రఫీ పట్ల తమ అభిరుచిని కొనసాగిస్తున్నారు.
 
ప్రారంభోత్సవ సందర్భంగా శ్రీ సజ్జన్‌ కుమార్‌ మాట్లాడుతూ, ‘‘ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో నికాన్‌ యొక్క నూతన ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. వైవిధ్యమైన సంస్కృతి, వారసత్వంకు సుప్రసిద్ధి రాజమండ్రి. భారతదేశ వ్యాప్తంగా మా కార్యకలాపాలు విస్తరిస్తోన్న వేళ, భారతీయ ఫోటోగ్రఫీ కమ్యూనిటీకి మద్దతు అందించాలనే మా నిబద్ధతకు కట్టుబడి ఉన్నాము. ఈ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ ఔత్సాహికులకు వినోదాత్మక, అనుసంధానిత అనుభవాలను అందించనుందని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.
 
ఆయనే మాట్లాడుతూ, ‘‘దక్షిణ భారతదేశంలో ఆధునిక మీడియా మరియు యువత కేంద్రీకృత సంస్కృతి స్థిరంగా పెరుగుతుండటంతో సృజనాత్మక వ్యక్తీకరణకు వినూత్న అవకాశం కలుగుతుంది. నికాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌ ప్రారంభించడమనేది ఫోటోగ్రఫీ కమ్యూనిటీకి సాటిలేని మద్దతు అందించాలనే నికాన్‌ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. రాజమండ్రిలో లీనమయ్యే, అనుసంధానిత ఫోటోగ్రఫీ అనుభవాలను అందించడం ద్వారా మా బ్రాండ్‌ యొక్క నాయకత్వ స్ధానం  మరింతగా బలోపేతం చేసుకోవడం లక్ష్యంగా చేసుకున్నాము’’ అని అన్నారు.
 
రాజమండ్రి నగరంలో ఔత్సాహిక సృజన పరులతో పాటుగా పరిశ్రమలో అత్యంత నిష్ణాతులు కూడా ఉన్నారు. వీరిలో సినిమాటోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లు మరియు వ్లోగర్లు ఉన్నారు. ఈ ఎక్స్‌పీరియన్స్‌ జోన్‌, టచ్‌ అండ్‌ ఫీల్‌ అనుభవాలను వినియోగదారులకు అందిస్తుంది. అదే సమయంలో యువ మిల్లీనియల్స్‌ తమ సృజనాత్మకతను ఆవిష్కరణలు, ఊహలతో ముందుకు తీసుకువెళ్లే అవకాశమూ అందిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక రాజధానిలో ఫోటోగ్రఫీ ప్రపంచాన్ని వాస్తవికంగా తీసుకురావడంతో, ఈ జోన్‌ ఈ ప్రాంతంలోని అన్ని వైపుల నుంచి పరిశ్రమ నిపుణులను ఆకర్షించనుందని అంచనా.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు