నిప్పాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అనేది ఓపెన్ ఎండెడ్ డైనమిక్ ఈక్విటీ స్కీమ్. భారీ, మధ్య మరియు చిన్న తరహా క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెడుతుంది. అనిశ్చితి కాలంలో లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడుల కేటాయింపులను వృద్ధి చేయడంతో పాటుగా అదే సమయంలో మార్కెట్ సానుకూల పరిస్థితిలలో మిడ్, స్మాల్ క్యాప్స్ నుంచి కూడా ప్రయోజనం పొందుతుంది.
నిప్పాన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ ఈడీ మరియు సీఈవో సందీప్ సిక్కా మాట్లాడుతూ, మా పట్ల అచంచల విశ్వాసంచూపిన 2.52 లక్షల మంది మదుపరులకు ధన్యవాదములు తెలుపుతున్నాం. వారు 2860 కోట్ల రూపాయలను ఇటీవల ముగిసిన నిప్పాన్ ఇండియా ఫ్లెక్సీ క్యాప్ ఫండ్‌లో పెట్టుబడులు పెట్టారు. గత 15 నెలల్లో చేరిన 15 లక్షల మంది నూతన పెట్టుబడిదారులకు ఇది అదనం. ప్రస్తుతం మా మదుపరుల సంఖ్య 75 లక్షలకు చేరింది. ఈ ఎన్‌ఎఫ్‌ఓ మా బలీయమైన పంపిణీ సామర్థ్యం ప్రదర్శించడంతో పాటుగా మా బ్రాండ్ పట్ల మదుపరులు చూపుతున్న నమ్మకం, మా డిజిటల్ మౌలిక వసతులను ప్రతిబింబిస్తుంది అని అన్నారు.