ఏప్రిల్ ఒకటో తేదీ... తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఏప్రిల్ ఫూల్ కాదండోయ్..!!

ఠాగూర్

సోమవారం, 1 ఏప్రియల్ 2024 (11:12 IST)
సాధారణంగా ఏప్రిల్ ఒకటో తేదీ వస్తే ఇతరులను ఫూల్ చేసేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తుంటారు. అయితే, ఏప్రిల్ ఒకటో తేదీన గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. ఇది మాత్రం ఏప్రిల్ ఫూల్ కాదండోయ్. నిజంగానే గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. అయితే, గృహ అవసరాలకు వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధర మాత్రం కాదు సుమా. కేవలం వాణిజ్య అవసరాల కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించారు. ఈ ధర ఒక్కో సిలిండర్‌పై రూ.30.50 పైసలు చొప్పున తగ్గించారు. ఈ తగ్గిన ధరల ప్రకారం ఢిల్లీలో ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ధర రూ.1764.50కు చేరుకుంది. అలాగే, 5 కేజీల ఎఫ్టీఎల్ సిలిండర్ ధరను కూడా తగ్గించారు. ఈ ధర తగ్గింపు రూ.7.50పైసలుగా ఉంది. అయితే, గృహ అవసరాల కోసం వినియోగించే ధరలు మాత్రం యధావిధిగా ఉంచారు.
 
ఇదిలావుంటే, ఇంధన ధరలు, మార్కెట్ డైనమిక్స్‌లో చోటుచేసుకునే హెచ్చుతగ్గుల కారణంగా గ్యాస్ ధరలను ప్రతి నెల ఒకటో తేదీన సవరణలు చేస్తున్న విషయం తెల్సిందే. ఫిబ్రవరి ఒకటో తేదీన ఇండేన్ గ్యాస్ సిలిండర్ల ధరలు మెట్రో నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబైలలో ఒక్కో రేట్లు ఉన్నాయి. అయితే, మార్చి ఒకటో తేదీ రాగానే అన్ని మెట్రో నగరాల్లో ఇండేన్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. ఇక ధరలు తగ్గుదల వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ, అంతర్జాతీయ చమురు ధరలలో మార్పులు, పన్నుల విధానంలో మార్పులు, సరఫరా - డిమాండ్ వంటి వివిధ అంశాలు అటుంవంటి సవరణలకు దోహదం చేస్తుంటాయనేది మార్కెట్ నిపుణులు చెబుతున్నమాట. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు