13 రోజుల్లో 11వ సారి పెరిగిన పెట్రోల్ ధరలు

ఆదివారం, 3 ఏప్రియల్ 2022 (10:10 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరల పెరుగుదలకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడం లేదు. గత 13 రోజుల్లో 11వ సారి ఈ ధరలు పెరిగాయి. అంటే ఈ 11 రోజుల్లో ఏకంగా 9 రూపాయల వరకు చమురు కంపెనీలు కంటికి తెలియకుండా పెంచేశాయి. 
 
తాజాగా లీటరు పెట్రోల్‌పై 91 పైసలు, డీజిల్‌పై 87 పైసలు చొప్పున పెరిగింది. తాజా పెంపుత హైదరాబాద్ నగరంలోని లీటరు పెట్రోల్ ధర రూ.117.21కి చేరగా, డీజిల్ ధర రూ.103.03కు చేరుకుంది. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా వివిధ జిల్లాలో వేర్వేరుగా ఈ ధరలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు జిల్లాలో పెట్రోల్‌పై 87 పైసలు, లీటరు డీజిల్‌పై 84 పైసలు చొప్పున పెరిగింది. దీంతో లీటరు పెట్రోల్ ధర రూ.119.07గాను, డీజిల్ ధర రూ.104.78గా ఉంది. ఇకపోతే, దేశ రాజధాని ఢిల్లీలో 80 పైసలు చొప్పున పెంచారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు