తగ్గని చమురు ధరలు.. 21వ రోజూ అదే పరిస్థితి..

శనివారం, 27 జూన్ 2020 (18:15 IST)
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టట్లేదు. లాక్‌డౌన్‌ నిబంధనలను పూర్తిగా ఎత్తివేసిన తర్వాత జూన్‌ 7 నుంచి దేశంలో పెట్రో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో జూన్‌ 1న లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.71.26గా ఉండగా, ప్రస్తుతం అది రూ.80.33కి చేరింది. శుక్రవారం పెట్రోల్‌పై 21 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచాయి. 
 
ఈ నేపథ్యంలో 21వ రోజైన శనివారం కూడా చమురు ధరలు తరగలేదు. శనివారం లీటర్‌ పెట్రోల్‌‌పై 25పైసలు, డీజిల్‌ లీటర్‌ పై 21 పైసలు పెరిగాయి. ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 79.92 పైసలు, డీజిల్‌ ధర 80.02, చెన్నైలో పెట్రోల్‌ రూ. 80.38, డీజిల్‌ ధర రూ.80.40పైసలు పెరిగాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినా కరోనా నష్టాలను ఇంధన సంస్థలు ఈ రూపంలో ధరలు పెంచి భర్తీ చేసుకుంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు