కరోనా వచ్చినా సామాన్యుడిపై పెనుభారం.. 16వ రోజు పెట్రో వడ్డన

సోమవారం, 22 జూన్ 2020 (12:21 IST)
కరోనా విజృంభిస్తున్న తరుణంలో సామాన్యుడిపై భారం పెరుగుతోంది. అత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఇందులో భాగంగా 16వ రోజైన సోమవారం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. కరోనా కష్టకాలంలోనూ ప్రభుత్వాలు దోపిడీ ఆపడం లేదు. వరుసగా 16వ రోజు కూడా  చమురు సంస్థలు పెట్రోల ధరలను వడ్డించాయి.
 
లీటర్ పెట్రోల్‌పై 33పైసలు, డీజిల్‌పై 58 పైసలు పెరిగింది. దీంతో.. 16 రోజుల్లో లీటర్‌ పెట్రోల్‌పై రూ.8.36కి పెరగగా... లీటర్ డీజిల్‌పై రూ.8.85 వడ్డించాయి. ఫలితంగా పెట్రోలు, డీజిల్‌ ధరలను అంతకంతకూ పెంచుతూ... సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి చమురు సంస్థలు. 
 
దాదాపు 3 నెలల లాక్‌డౌన్‌తో జనం దగ్గర డబ్బుల్లేవు. ఆంక్షలు తొలగించినా చాలా వ్యాపారాలు మూతపడ్డాయి. ఫలితంగా అనేక మంది ఉపాధి కోల్పోయారు. ఇలాంటి సమయంలోనూ రోజురోజుకి పెట్రోల్ ధర పెరుగుతోంది. దీనిపై వామపక్షాలు ఆందోళన చేపట్టినా ఫలితం అంతంతమాత్రంగానే వుంది. ఇందుకు కేంద్రం దిగిరావట్లేదు. పెరుగుతున్న ధరలకు మోదీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు