తగ్గిన పెట్రోల్ - డీజల్ ధరలు

ఆదివారం, 5 సెప్టెంబరు 2021 (10:51 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు మరోమారు తగ్గాయి. రెండు రోజుల విరామం తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 18 పైసల చొప్పున తగ్గించాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ.105.23, డీజిల్‌ రూ.96.66కు తగ్గాయి.
 
అలాగే, దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.101.19గా ఉండగా, డీజిల్‌ ధర రూ.88.62 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.107.26 కాగా, డీజిల్‌ రూ.96.19 గా ఉంది. చెన్నైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.99.12 గా ఉండగా, డీజిల్‌ ధర రూ.93.40 గా నమోదైంది. 
 
గత కొన్ని రోజులుగా పెరుగుతున్న పెరుగుతున్న ధరలకు బ్రేక్‌ పడడంతో పాటు స్వల్పంగా తగ్గుదల కూడా కనిపిస్తోంది. చాలా రోజుల తర్వాత పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తోంది. అయితే ఈ తగ్గుదల భారీగా లేకపోయినప్పటికీ.. ధరల పెరుగుదులకు చెక్‌పడడంతో వాహనదారులు కొంతలో కొంత సంతోషంగా ఉన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు