సిలిండర్ ధరలు మళ్లీ పెరిగాయి. ఒక వైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ధరలు పెరగడంతో సామాన్యులకు భారీగా మారిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సబ్సిడీ గ్యాస్ సిలిండర్‌పై 25 రూపాయల వరకు పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకుంది.
తాజా ధరల ప్రకారం.. ఇక 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.912 ఉండగా, ఇక ఢిల్లీలో ధర రూ.884, అలాగే కోల్‌కతాలో రూ.886.50, ముంబైలో రూ.859.50, చెన్నైలో రూ.-875.50 ఉంది
ఇకపోతే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. సిలిండర్ బుకింగ్, డెలివరీ బాయ్ తీసుకునే చార్జీ కలుపుకొంటే దాదాపుగా రూ.1000 వరకు చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంటే దాదాపు రూ.1000 పెడితే కానీ గ్యాస్ సిలిండర్ లభించని పరిస్థితి నెలకొంది.