శ్రీలంక దేశంలో ఆర్థిక సంక్షోభం మరింతగా ముదిరిపోతోంది. ఈ కారణంగా ఆ దేశ ప్రజలు అన్నిరకాలుగా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఇపుడు పెట్రోల్, డీజల్ ధరలు కూడా ఆకాశానికి ఎగబాకాయి. తాజాగా లీటరు పెట్రోల్, డీజల్ ధరలు అమాంతం పెరిగిపోయాయి.
తాజాగా, పెట్రోలుపై రూ.50, డీజిల్‌పై రూ.60 పెంచారు. ఈ ధరలు ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి అమల్లోకి రానున్నాయని శ్రీలంక ప్రభుత్వ రంగ సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) తెలిపింది. దీంతో శ్రీలంకలో లీటరు పెట్రోలు ధర రూ.470, డీజిల్ ధర రూ.460కి పెరిగింది. శ్రీలంకలో పెట్రోలు, డీజిల్ ధరలను పెంచడం రెండు నెలల్లో ఇది మూడవసారి.
చివరిసారిగా మే 24న పెట్రోలుపై 24 శాతం, డీజిల్‌పై 38 శాతం ధరలు పెంచారు. ఇంధనాన్ని తీసుకొచ్చే నౌకలు బ్యాంకింగ్‌తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యంగా వస్తున్నాయని సీపీసీ తెలిపింది. వచ్చేవారం బంకుల్లో పెట్రోల్, డీజిల్ పరిమితంగా ఉంటుందని పేర్కొంది.