శ్రీలంకను వేధిస్తున్న ఇంధన కొరత - ఆఫీసులు - స్కూల్స్ మూసివే

ఆదివారం, 19 జూన్ 2022 (12:40 IST)
పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న శ్రీలంకను ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తుంది. దీంతో ఆ దేశ పాలకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు పాఠశాలలను మూసివేస్తూ ఆదేశాలు జారీచేశారు. అయితే, ఈ మూసివేత నుంచి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాలకు మాత్రం మినహాయింపునిచ్చింది. అలాగే, కొలంబో సిటీ పరిధిలోని స్కూల్స్‌లు మాత్రం ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహించేలా ఆదేశించింది. ఒకవైపు ఇంధన కొరత, మరోవైపు, గంటల కొద్దీ కరెంట్ కోతలు అమలవుతున్నాయి. దీంతో ఈ నిర్ణయం తీసుకుంది. 
 
కాగా, శ్రీలంకలో గత నెల రోజులుగా రోజుకు 13 నుంచి 15 గంటల పాటు కరెంట కోతను అమలు చేస్తున్నారు. అలాగే, ఇంధన కొరత కూడా తీవ్రంగా వేధిస్తుంది. పెట్రోల్ బంకుల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్, డీజిల్ కొరతతో అనేక మంది ఉపాధిని కూడా కోల్పోయారు. 
 
కాగా, గత కొన్ని రోజులుగా శ్రీలంక ప్రభుత్వం ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న విషయం తెల్సిందే. రెండు కోట్లకుపైగా జనాభా కలిగిన శ్రీలంకలో ఎన్నడూ లేని విధంగా అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఉత్పన్నమైంది. విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గిపోయింది. ఔషధాల కొరత ఏర్పడింది. దీంతో శ్రీలంకలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు