తగ్గించినట్టు తగ్గించి.. మళ్లీ 'పెట్రో' వడ్డన.. ఆయిల్ కంపెనీలు

ఆదివారం, 16 ఏప్రియల్ 2017 (10:44 IST)
దేశంలో మళ్లీ పెట్రో ధరలు పెరిగాయి. ఈనెల ఆరంభంలో ధరలు తగ్గించినట్టే తగ్గించి.. మళ్లీ ధరలు పెంచాయి. పెంచిన ధరలు తక్షణం అమల్లోకి వచ్చాయి. తాజాగా, పెట్రోలుపై రూ.1.39, డీజెల్‌పై రూ.1.04 మేరకు పెంచుతున్నట్టు ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రకటించాయి. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చమురు కంపెనీలు ఓ ప్రకటనలో తెలిపాయి. 
 
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో వచ్చిన మార్పునకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాయి. కాగా, ఈ నెల 1వ తేదీన పెట్రోలుపై రూ.3.77, డీజెల్ పై రూ.2.91 చొప్పున తగ్గిస్తూ, చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి