విశాఖకు రైల్వే జోన్ ప్రారంభానికి కాలగడువు లేదు: పియూష్ గోయల్

శుక్రవారం, 5 ఫిబ్రవరి 2021 (15:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా, విశాఖకు రైల్వే జోన్ కేటాయించాల్సివుంది. కానీ ఆ హామీ ఇప్పటివరకు అమలు కాలేదు. అయితే, ఇటీవల బడ్జెట్‌లో విశాఖ రైల్వే జోన్‌పై ప్రకటన వెలువడుతుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. 
 
తాజాగా రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ సమాధానమిచ్చారు. రైల్వే జోన్ ఎప్పుడు మొదలవుతుందో చెప్పలేమని అన్నారు. రైల్వే జోన్ ప్రారంభానికి నిర్దిష్ట కాలపరిమితి లేదు అని వెల్లడించారు. 
 
రైల్వే జోన్ డీపీఆర్ ఇంకా పరిశీలనలోనే ఉందని, రైల్వే జోన్ ప్లానింగ్‌కు ఓఎస్డీని నియమించామని తెలిపారు. విశాఖ రైల్వే జోన్‌ను ఆంధ్రా డివిజన్‌లో చేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదని పియూష్ గోయల్ స్పష్టం చేశారు.
 
కాగా, విభజన హామీ మేరకు రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని విపక్ష పార్టీల నేతలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నాయి. కానీ, కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. అదేసయమంలో వైకాపా ప్రభుత్వం మాత్రం ఈ అంశంపై నోరు మెదపడం లేదు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు