విమానయాన రంగంలో 100 శాతం పెట్టుబడులు? ఖతార్ నుంచి 100 కొత్త జెట్ లైనర్స్

మంగళవారం, 28 మార్చి 2017 (15:46 IST)
భారత దేశంలో దేశీయ విమానయాన రంగంలో వందకు వంద శాతం విదేశీ పెట్టుబడులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అనుమతి ఇస్తారనే నమ్మకంతో ఖతార్ ఎయిర్‌వేస్.. దాదాపు 100 కొత్త జెట్ లైనర్స్‌ను ఆర్డర్ చేయనుంది. భారత్‌లో కొత్త ఎయిర్‌‍లైన్స్‌ను స్థాపించేందుకు అనుమతుల గురించి తెలుసుకుని టెండర్ వేస్తామని ఖతార్‌ ఎయిర్‌వేస్‌ సీఈఓ అల్‌ బకర్‌ తెలిపారు. ఈ ప్రక్రియ ఏడాదిలోనే పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. 
 
అలాగే భారత్‌లో విమానయాన సంస్థను స్థాపించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు అల్ బకర్ వెల్లడించారు. వంద విమానాలతో భారత్‌లో విమానయాన వ్యాపారంలో ప్రవేశిస్తామని ఆయన తెలిపారు. అయితే భారత స్వదేశీ విమానయానంలో విదేశీ ఎయిర్‍‌లైన్స్‌కు ఇప్పటికే వందశాతం పెట్టబడులకు ఛాన్స్ లేదు. కానీ భవిష్యత్తులో ఉంటుందనే ఆలోచనతోనే ఖతార్‌తో పాటు ఎయిర్‌‍లైన్స్ భారత్‌లో వ్యాపార విస్తరణకు సన్నాహాలు మొదలెట్టాయి.

వెబ్దునియా పై చదవండి