రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గోల్డ్ లోన్ కంపెనీలకు షాకిచ్చింది. మణప్పురమ్ ఫైనాన్స్, ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలు నిర్దేశిత నిబంధనలను అతిక్రమించారంటూ ఇరు కంపెనీలకు భారీ జరిమానా విధించింది. ముత్తూట్ ఫైనాన్స్, మనప్పురం ఫైనాన్స్‌లకు వరుసగా రూ.10లక్షలు, రూ.5లక్షలు జరిమానా విధించినట్టు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
అంతేకాకుండా సంస్థ రూ.5 లక్షలకు పైన బంగారు రుణాలు జారీ చేసేటప్పుడు రుణ గ్రహీతల నుంచి పాన్ కార్డు తీసుకోవడమనే రూల్స్‌ను అనుసరించలేదని, అందుకే ఫైన్ వేశామని వివరణ ఇచ్చింది. దీంతోపాటు గోల్డ్ జువెలరీ ఓనర్‌షిప్ వెరిఫికేషన్ రూల్స్‌ను అనుసరించకపోవడంతో త్రిసూర్‌లోని మణపురం ఫైనాన్స్‌పై ఆర్‌బీఐ చర్య తీసుకుంది. రూ.5 లక్షల జరిమానా విధించింది.