మీ బ్రాంచ్ ఏటీఎం కాకుండా మరో బ్యాంకు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకుంటే.. అప్పుడు మీ బ్యాంకు .. ఏటీఎం బ్యాంక్‌కు డబ్బులు చెల్లించాలి. దీన్నే ఇంటర్‌ఛేంజ్ ఫీజు అని అంటారు. అంతేకాకుండా ఉచిత లావాదేవీల పరిమితి దాటిన తర్వాత బ్యాంకు కస్టమర్లు ఏటీఎంల నుంచి లావాదేవిలు నిర్వహిస్తే అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో లావాదేవిపై రూ.21 వరకు వసూలు వసూలు చేయవచ్చు.