ఇందుకోసం లోన్ రీస్ట్రక్చరింగ్ 2.0 వెసలుబాటును తెచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కొన్ని కీలక అంశాలను వెల్లడించారు. పర్సనల్ లోన్లు, చిన్న తరహా బిజినెస్ లోన్లు తీసుకున్న వారు మరో రెండేళ్ల వరకు మారటోరియంను వినియోగించుకోవచ్చని తెలిపింది. రూ.25కోట్ల రుణాల లోపు ఉన్నవారికి ఈ సౌలభ్యం ఉంటుంది.
అయితే 2021 మార్చి 31 లోపు రుణాలు తీసుకున్న వారికే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది. రుణ గ్రహీతల కోసం బ్యాంకులు సెప్టెంబర్ 30లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చరింగ్ వెసలుబాటును అమలు చేయొచ్చు. గతేడాది మారటోరియంను వినియోగించుకున్న వారు, కొత్తవారు కూడా దీన్ని పొందవచ్చని స్పష్టం చేసింది.