నాడు ఉచితం.. నేడు షాకులపై షాకులు.. చార్జీల మోత మోగిస్తున్న జియో

ఠాగూర్

మంగళవారం, 21 జనవరి 2025 (10:22 IST)
దేశంలో టెలికాం సేవలు ప్రారంభించే సమయంలో ఉచితాల పేరుతో వినియోగదారులను అమితంగా ఆకర్షించిన రిలయన్స్ జియో.. ఇపుడు చార్జీల మోత మోగిస్తుంది. ఇష్టానుసారంగా ప్లాన్ రేట్లను పెంచేస్తుంది. ఈ క్రమంలో తాజాగా మరోమారు చార్జీలను పెంచేసింది. 
 
నిజానికి రిలయన్స్ జియో టారిఫ్ ధరలను గతేడాది జులైలో భారీగా పెంచిన విషయం తెలిసిందే. నాడు టారిఫ్ ధరలను పెంచడంపై యూజర్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ క్రమంలో కొందరు తక్కువ ధరలకు రీచార్జ్ ప్లాన్లు అందించే ఇతర నెట్‌వర్క్‌కు మారిపోయారు. యూజర్ల వ్యతిరేకతను గుర్తించిన రిలయన్స్ జియో.. తన వినియోగదారులను కాపాడుకునేందుకు తక్కువ ధరతో మంచి బెనిఫిట్‌ను అందించే రీచార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. దీంతో ఇతర నెట్‌వర్క్‌కు మారే వారి సంఖ్య తగ్గింది.
 
అయితే తాజాగా పోస్ట్ పెయిడ్ ధరలను పెంచుతూ రిలయన్స్ జియో షాకింగ్ ప్రకటన చేసింది. రూ.199 ప్లాన్‌పై ఏకంగా రూ.100 పెంచి .. ఇకపై రూ.299 వసూలు చేయనున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు జనవరి 23 నుంచి అమల్లోకి వస్తాయని రిలయన్స్ జియో పేర్కొంది. కాగా ఈ రీచార్జ్ ప్లాన్‌లో నెలకు అన్ లిమిటెడ్ కాల్స్, 25 జిబీ డేటా పొందుతారు. అయితే కొత్తగా కనెక్షన్ తీసుకునే యూజర్లు మాత్రం రూ.299కి బదులు రూ.349తో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుందని జియో వెల్లడించింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు