జీఐసీ, టీపీజీ కలిపి రూ.7,350 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నాయి. ఐతే జీఐసీ రూ.5,512.5 కోట్లు పెట్టుబడి చేయనుంది. టీపీజీ రూ.1,837.5 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు రిలయన్స్ సంస్థ పేర్కొంది.
తాజా పెట్టుబడుల ద్వారా రిలయన్స్ రిటైల్ వింగ్ లిమిటెడ్‌లో జీఐసీ 1.22 శాతం, టీపీజీ 0.41 శాతం ఈక్విటీ వాటాను సొంతం చేసుకోనున్నాయి. కాగా, తాజా పెట్టుబడులతో కలిపి రిలయన్స్ రిటైల్ ఇప్పటివరకు 7.28 శాతం వాటా విక్రయం ద్వారా రూ.32,197 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకుంది.