మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ బొమ్మను త్వరలో ప్రవేశపెట్టనున్న వంద రూపాయల నాణేంలో ఆర్బీఐ ముద్రించనుంది. వాజ్‌పేయ్ బొమ్మతో కూడిన వందరూపాయల నాణేలు 35 గ్రాముల బరువుతో కూడుకున్నవి. ఈ నాణెంలో ఒకవైపు ఆంగ్లం, దేవనాగరి భాషల్లో 100 రూపాయలను ముద్రిస్తారు. మరోవైపు వాజ్ పేయ్ బొమ్మను ముద్రిస్తారు.
ఇంకా వాజ్‌పేయ్ పుట్టిన, మరణించిన సంవత్సరాలు 1924-2018ని ముద్రిస్తారు. ఇంకా అశోక స్తంభాన్ని మధ్యలో ముద్రిస్తారు. వీటితో పాటు సత్యమేవ జయతే అని ముద్రించడం జరుగుతుంది. కాగా మాజీ ప్రధాన మంత్రి వాజ్‌పేయి గత 1996వ సంవత్సరం 13 రోజులు, 1998వ సంవత్సరం 13 నెలలు, 1999లో ఆరేళ్ల పాటు దేశానికి ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.