ప్రేరణ, పరివర్తనకు వాగ్దానం చేస్తోన్న TEDx హైదరాబాద్ యొక్క 9వ ఎడిషన్

మంగళవారం, 30 మే 2023 (23:14 IST)
టెడ్ ఎక్స్ హైదరాబాద్ నేడు, అత్యంత ఆశక్తి గా ఎదురుచూస్తున్న తమ వార్షిక కార్యక్రమం యొక్క 9వ ఎడిషన్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఈ కార్యక్రమం ఆదివారం, సెప్టెంబర్ 17, 2023న గచ్చిబౌలిలోని ప్రధాన్ కన్వెన్షన్స్‌లో నిర్వహించనున్నారు. పూర్తిగా  లీనమయ్యేటట్లు గా ఉండే ఈ రోజు, వినూత్న అనుభవాలతో వ్యక్తులలోని శక్తిని ప్రేరేపిస్తుంది, మరియు వారి ఆశయాలు, కోరికలను ఉత్సుకత మరియు ప్రేరణతో నింపుతుంది.
 
విఖ్యాత నటుడు,TEDx హైదరాబాద్ స్పీకర్ రానా దగ్గుబాటి, TEDx హైదరాబాద్ 2023 పోస్టర్ నేడు విడుదల చేశారు. "ఈ సంవత్సరం థీమ్‌ IGNITE ను  ఆవిష్కరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది.  TEDxహైదరాబాద్తో కలిసి నేను, ఈ సారి అపరిమితమైన సంభావ్యతతో , ఉత్సాహం  కలిసినప్పుడు జరిగే అద్భుతమైన మాయాజాలాన్ని అనుభవించిన సుదీర్ఘ చరిత్రను పంచుకోబోతున్నాను. సెప్టెంబర్ 17న జరిగే TEDxహైదరాబాద్ 9వ ఎడిషన్‌లో ఈ పరివర్తన శక్తిని చూసేందుకు సిద్దంగా ఉండండి, మనలో నిద్రాణమైన శక్తిని మేల్కొలిపే  రోజు గా అది నిలుస్తుంది" అని రానా దగ్గుపాటి అన్నారు
 
"ఇగ్నైట్" నేపథ్యం తో నిర్వహిస్తున్న TEDxహైదరాబాద్ 2023 ఒకే ఆలోచన యొక్క పరివర్తన శక్తి లేదా ఒక విప్లవాన్ని ప్రేరేపించగల స్పూర్తిదాయక క్షణం ని కలిగి ఉంటుంది. ఇది పురోగతి మరియు మార్పుకు సహాయపడుతుంది. రోజంతా జరిగే ఈ కార్యక్రమం మనలోని అభిరుచిని పెంపొందించడానికి, హాజరైన వారికి కొత్త కార్యక్రమం ప్రారంభించేందుకు మరియు వారి ఆశయాలను నెరవేర్చుకోవడానికి తగిన శక్తినివ్వడానికి అంకితం చేయబడింది. ఉత్సుకత మరియు స్పూర్తితో, TEDxహైదరాబాద్, అభ్యాసం, ఎదుగుదల మరియు శ్రేష్ఠత వైపు మార్గాన్ని ప్రకాశింపజేస్తూ లోపల ఆశక్తి ని రేకెత్తించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
 
TEDxహైదరాబాద్ యొక్క క్యూరేటర్ మరియు లైసెన్సీ, వివేక్ వర్మ, రాబోయే ఈవెంట్ గురించి మాట్లాడుతూ "మన సమాజంలో మార్పును రేకెత్తించే పరివర్తన ఆలోచనలను రేకెత్తించడానికి TEDxహైదరాబాద్ ఒక వేదిక. స్ఫూర్తినిచ్చే వివిధ విభాగాలకు చెందిన విశేషమైన వ్యక్తులను ఒకచోట చేర్చినందుకు మేము సంతోషిస్తున్నాము మరియు విభిన్నంగా ఆలోచించమని ప్రేక్షకులను కోరుతున్నాము . ఈ సంవత్సరం ఈ కార్యక్రమం అత్యంత ఉత్తేజకరమైనదిగా ఉంటుందని వాగ్దానం చేస్తున్నాము.." అని అన్నారు.
 
ఈ సంవత్సరం TEDxహైదరాబాద్ విభిన్న నేపథ్యాల నుండి 12-16 మంది స్పీకర్‌లను ఒకచోట చేర్చి వారి ఆలోచనలు మరియు అనుభవాలను ఒక చిన్న ఆలోచన ఎలా స్ఫూర్తిని మరియు సంభావ్యతను రేకెత్తిస్తుందనేది చూపనుంది. ఈ చర్చలు వినోదం, అత్యాధునిక సాంకేతికత, వ్యవస్థాపకత మరియు సైన్స్‌తో సహా వివిధ రంగాలలో విస్తరించి ఉంటాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు